జగన్ కృషిని అభినందిస్తున్నాం : యార్లగడ్డ
విశాఖపట్నం: తెలుగు భాష అభివృద్ధికి జగన్ కృషిని అభినందిస్తున్నామని యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ అన్నారు.
శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో తెలుగు తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
గత ఐదేళ్లలో తెలుగు భాష అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు.
తెలుగు వర్సిటీ, తెలుగు అకాడమీ విభజనను వేగవంతం చేయాలని యార్లగడ్డ పేర్కొన్నారు.
Comments
Post a Comment