కర్నూలు జిల్లాలో భారివర్షం..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం నాడు భారీ వర్షం కురిసింది.
ఈ వర్షం థాటికి ఆలూరులోని కురవళ్లి దగ్గర కల్వర్లు తెగిపోయాయి.
దీంతో బళ్లారి-కర్నూలు మధ్య రాకపోకలు ఆగిపోయాయి.
కల్వర్లకు అటు ఇటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది.
వాహనదారులు వెనుదిరిగి వెళ్లేందుకు వీలుకాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, సహాయక సిబ్బంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నట్లు తెలిసింది.
కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment