మెసేజ్ పంపాలంటే ఫింగర్ ప్రింట్ తప్పనిసరి... వాట్సప్‌ను కోరిన ప్రభుత్వం
యూజర్లకు ప్రైవసీ కోసం వాట్సప్‌లో ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఉంది. ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌తో మెసేజ్ పంపినవారికి, స్వీకరించినవారికి తప్ప ఆ మెసేజ్ ఇతరులు ఎవరూ చూసే అవకాశం ఉండదు. ఈ ఫీచర్‌తో ప్రైవసీకి ఇబ్బంది లేకపోయినా, ఫేక్ న్యూస్ వైరల్ చేసేవారిని గుర్తించడం సాధ్యం కావట్లేదు. ఓ తప్పుడు వార్తను సృష్టించి వైరల్ చేస్తే దాన్ని మొదట పంపినవారు ఎవరో గుర్తించే వీలు లేకుండా పోతోంది. ఈ విషయంలో వాట్సప్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. వైరల్ మెసేజ్‌లు, తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేస్తున్నవారిని గుర్తించేందుకు, వాటిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని చాలాకాలంగా వాట్సప్‌ను కోరుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు డిజిటల్లీ ఫింగర్‌ప్రింట్ మెసేజెస్ ఫీచర్‌ను రూపొందించాలని వాట్సప్‌ను కేంద్రం కోరినట్టు ఎకనమిక్ టైమ్స్ కథనం.డిజిటల్లీ ఫింగర్‌ప్రింట్ మెసేజెస్ అంటే... ఎవరైనా కొత్తగా ఓ మెసేజ్ టైప్ చేసి పంపాలంటే వేలిముద్ర తప్పనిసరి. దీనివల్ల ఆ మెసేజ్ సృష్టించింది ఎవరో తెలుసుకోవడం సులువవుతుందన్నది కేంద్రం వాదన. ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్ చేయకుండా ఓ మెసేజ్ సృష్టించింది ఎవరు? ఎంతమందికి ఫార్వర్డ్ చేశారు? ఇప్పటి వరకు ఎంతమంది చదివారు? అన్న విషయాలు తెలుసుకోవాలని కేంద్రం వాట్సప్‌ను కోరుతోంది. యూజర్లు పంపే మెసేజెస్ చదవడం తమ ఉద్దేశం కాదని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ మెసేజ్ పంపింది ఎవరని తెలుసుకోవడం కోసమే ఈ ఫీచర్ ఉండాలని కేంద్ర ప్రభుత్వ వర్గాల వాదన. డిజిటల్లీ ఫింగర్‌ప్రింట్ మెసేజెస్ ఫీచర్ విషయంలో వాట్సప్ స్పందించాల్సి ఉంది.
Comments
Post a Comment