దుబాయ్ నుంచి జైపూర్ వస్తున్న ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది.

న్యూఢిల్లీ: 

స్పైస్ జెట్‌కి చెందిన ఎస్‌జీ-58 విమానం టైరు పేలిపోయినప్పటికీ ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు.

ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 189 మంది ప్రయాణికులు ఉన్నారు.

‘‘జైపూర్‌లో విమానం ల్యాండ్ అవుతుందగనగా పైలట్లు జైపూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించారు.

ఏటీసీ సూచనలను పాటిస్తూ విమానాన్ని క్షేమంగా దించారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా కిందికి దిగారు.

విమానానికి కూడా ఏమీ కాలేదు...’’ అని స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. టైరు దుబాయ్ నుంచి బయల్దేరినప్పుడే పేలి ఉంటుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆ విమానాన్ని అధికారులు పరీక్షిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?