పత్రికా ప్రకటన
గౌ.సి.ఎం.ఆశయం మేరకు అవినీతి రహిత పాలనే లక్ష్యంగా, సామాన్యులకు అందుబాటులో ఉంటా - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతి, జూన్ 16: గౌరవ ముఖ్యమంత్రి ఆశయం మేరకు అవినీతి రహిత పాలన లక్ష్యంగా ఎల్లప్పుడూ సామాన్యులకు అందుబాటులో వుంటానని ఆదివారం ఉదయం 8.10 గంటలకు తుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
అంతకు ముందు తుడా కార్యాలయం చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వేదపండితులు పూర్ణ కుంభస్వాగతం పలికారు.
తుడా కార్యాలయంలో చైర్మన్ చాంబర్ చేరుకుని శ్రీవెంకటేశ్వర స్వామికి పూజలు చేసి తుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం సర్వమత ప్రార్ధనలతో ముస్లిం, క్రైస్తవ మతపెద్దలు తుడా చైర్మన్ కు ఆశీర్వాదాలు అందించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాపై నమ్మకం ఉంచి రెండవ సారి తుడా చైర్మన్ గా పదవి నిచ్చారని, ఆయన ఆశయం మేరకు తుడా అభివృద్ధికి, సామాన్య ప్రజలకు అందుబాటులో వుండి అవినీతి రహిత పాలన ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి శాసన సభ్యులు కరుణాకర రెడ్డి, తుడా సెక్రటరీ రామసుందర్ రెడ్డి, కార్యకర్తలు పెద్ద ఎత్తున బొకే లతో,శాలువలతో చైర్మన్ ను సత్కరించి అభినందనలు తెలిపారు.

Comments
Post a Comment