బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి

పంజాబ్

ఈ నెల 6న పంజాబ్​లోని సంగ్రూర్ జిల్లా భగవాన్​పురలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి ఫతేవీర్​ను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఫతేవీర్ పడిపోయిన బోరుబావి 150 అడుగుల లోతుగా ఉంది. పడిపోయి 92 గంటలు పైగానే గడిచింది. ఈ రోజు ఫతేవీర్​ పుట్టిన రోజు.

బాలుడు సురక్షితంగా బయటకు రావాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి పీజీఐ ఆస్పత్రి నుంచి వైద్యబృందం సంగ్రూర్​లోని ఘటనా స్థలానికి చేరుకుంది.

ఫతేవీర్​ను రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం, పటియాల సాయుధ ఇంజినీర్ల రక్షణ దళాలు సంయుక్త ఆపరేషన్​ను చేపడుతున్నాయి.

సహాయక చర్యల్లో స్థానికులూ సహకారాన్నందిస్తున్నారు.

ఘటనా స్థలానికి సమీపంలోని సునామ్-మాన్సా రహదారిపై పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడారు.

భగవాన్​పురలోని తమ ఇంటిలో ఆడుకుంటున్న రెండేళ్ల ఫతేవీర్ పక్కనే ఉన్న బోర్​వెల్​లో పడిపోయాడు.

ఇప్పటివరకూ ఎలాంటి ఆహారం పిల్లాడికి అందలేదని అధికారులు వెల్లడించారు. ఆక్సిజన్ మాత్రమే పంపించామని స్పష్టం చేశారు. 

ఐదు రోజులైనా బాలుడు బయటకు రాకపోవడం వల్ల స్థానికులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?