భారత వాయు సేనకు చెందిన రవాణా విమానం అదృశ్యం
భారత వాయు సేనకు చెందిన రవాణా విమానం సోమవారం అదృశ్యమైంది.
అస్సాంలోని జోర్హాట్ స్థావరం నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే అదృశ్యమైంది.
ఆంటోనోవ్ ఏఎన్-32 సైనిక రవాణా విమానం ఆచూకీ సోమవారం మధ్యాహ్నం సుమారు 1 గంట నుంచి తెలియకుండాపోయింది.
ఈ విమానంలో 13 మంది ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుక లోయలోని స్థావరానికి వెళ్ళేందుకు ఈ విమానం బయల్దేరింది.
ఈ విమానాన్ని కనుగొనేందుకు భారత వాయు సేన అన్ని విధాలుగానూ ప్రయత్నిస్తోంది.
Comments
Post a Comment