మామిడి తోటలో కాలేజీ స్టూడెంట్స్.. శ్రీకాకుళంలో బట్టబయలైన వ్యభిచారం
శ్రీకాకుళం జిల్లాలో వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు బట్టబయలు చేశారు.16వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓ మామిడి తోటలో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగుతున్నట్టు వారికి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పకడ్బందీగా తోటలోకి ప్రవేశించారు.ఆ సమయంలో దాదాపు అక్కడ 20మంది యువకులు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. పోలీసులను చూసి వారు తప్పించుకోవడానికి ప్రయత్నించగా చాకచక్యంగా పట్టుకున్నారు.
ఇందులో ఎక్కువమంది కాలేజీ విద్యార్థులే కావడం గమనార్హం. పట్టుబడ్డ అమ్మాయిలు రాజమహేంద్రవరానికి చెందినవారిగా గుర్తించారు.
మామిడి తోటల్లో ఈ వ్యవహారం ఎప్పటినుంచి కొనసాగుతోంది? దీని వెనకాల ఎవరున్నారు? అన్న కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Post a Comment