ముంబై నగరంలో కురుస్తున్న భారీవర్షలు
ముంబై :
ముంబై నగరంలో కురుస్తున్న భారీవర్షం తోపాటు మేఘాలు కమ్ముకోవడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన 11 విమానాలను దారి మళ్లించారు.
రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంతో మహారాష్ట్రలోని ముంబై నగరంలో భారీవర్షాలు కురుస్తున్నాయి.
భారీవర్షాలతో పలు విమానాలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయానికి మళ్లించామని ముంబై విమానాశ్రయ అధికారి వెల్లడించారు.
థాయ్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం ముంబై విమానాశ్రయంలోని రన్ వేపై దిగలేక మళ్లించారు.
భారీవర్షం వల్ల సబర్బన్ రైళ్ల రాకపోకల్లోనూ తీవ్ర జాప్యం జరిగింది.
ముంబై నగరంలోని శాంతాక్రజ్, మలాద్, కాండివలి, బోరివలి, కుర్లా, ఘట్ కోపర్, విఖ్రోలి ప్రాంతాల్లో భారీవర్షంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడ్డాయి.
Comments
Post a Comment