సీరియల్ నటి అదృశ్యం.. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు
తెలుగు టెలిజన్‌లో పలు సీరియల్లో నటించిన లలిత కనిపించకుండా పోవడం తెలుగు టీవీ, మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. అమీర్ పేట రాజరాజేశ్వరి హాస్టల్లో ఉంటున్న లలిత.. తెలుగులో గత యేడాది కాలంగా పలు టీవీ సీరియల్లో నటిస్తోంది. ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి చానెల్స్‌లో వచ్చే ప్రేమ, కళ్యాణ వైభోగం,స్వర్ణ ఖడ్గం వంటి పలు సీరియల్లో ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరం ఆమె సొంతూరు. గత రెండు మూడు రోజులుగా లలిత నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాక పోవడంతో తల్లి తండ్రులు అనుమానం వచ్చిన ఫోన్ చేయడంతో స్విచ్ఛాఫ్ రావడంతో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment