ఓ ప్రాథమిక పాఠశాలలో ఆరుబయటే విద్యార్థులకు క్లాసులు
తూర్పు గోదావరి జిల్లా :- పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు పూర్తి కావస్తున్నా.. ఓ ప్రాథమిక పాఠశాలలో ఆరుబయటే విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్న వైనం బుధవారం వెలుగు చూసింది. కాకినాడ నగరం జగన్నాథ పురంలో 330 మంది విద్యార్థులు ఉన్న నేతాజీ మున్సిపల్ కార్పోరేషన్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆరుబయటే క్లాసులు నిర్వహిస్తున్నారు. వర్షం వస్తే చిన్నారులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలో, చెత్తా చెదారం మధ్యలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కనీసం తాగడానికి మంచి నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరుగు దొడ్లు సిమెంటు బస్తాలు, స్మార్ట్ సిటి సామాగ్రితో నిండిపోయాయి. ఉన్న రెండు తరగతి గదులలో ఒక్కొక్క తరగతి గదిలో 70 మంది విద్యార్థులు కిక్కిరిసి కూర్చుని నానా అవస్థలు పడుతున్నారు...
Comments
Post a Comment