మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్‌లో బెదిరింపులొచ్చాయి.

జమ్మలమడుగు: మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్‌లో బెదిరింపులొచ్చాయి. దీనిపై కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ వ్యక్తి ఈ నెల 13న రాత్రి, 14 తేదీ ఉదయం ఫోన్‌ చేసి బెదిరించి డబ్బులు అడిగినట్లు పోలీసులు తెలిపారు. జమ్మలమడుగు డీఎస్పీ కె.కృష్ణన్‌ చెప్పిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన బాలకిరణ్‌రెడ్డి విజయవాడలో ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి ఈ నెల 13న రాత్రి, 14న ఉదయం ఫోన్‌ చేశారు. ‘మిమ్మల్నే నమ్ముకున్నాం. మీ వల్ల నాకు చాలా నష్టం జరిగింది. రూ.75 లక్షలు ఇవ్వాల్సిందే’ అంటూ ఫోన్‌లో బెదిరించారు. దీనిపై ఆదినారాయణరెడ్డి అనుచరుడు దేవగుడికి చెందిన కిరణ్‌ జమ్మలమడుగు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడి పూర్తి సమాచారం రాబడుతున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. బాలకిరణ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు జిల్లా అచ్చంపేట ఎస్సై పట్టాభిరామయ్య తెలిపారు. మరోవైపు పోలీసులు తన కుమారుడిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలపాలని నిందితుడి తండ్రి తోమస్‌రెడ్డి కోరుతున్నాడు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?