విజయసాయిరెడ్డి మరో పదవి... ఏపీలో ఇక కేబినెట్ మంత్రి హోదా

వైసీపీలో జగన్ తరువాత అత్యంత కీలక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి దక్కింది. విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాజా నియామకంతో ఇకపై విజయసాయిరెడ్డికి ఏపీలో కేబినెట్ మంత్రి హోదా లభించనుంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పటికే వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

వైసీపీ తరపున పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి... రాజ్యసభలోనూ వైసీపీపక్ష నేతగా ఉన్నారు. అయితే పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించే విజయసాయిరెడ్డికి రాష్ట్రంలోనూ కేబినెట్ మంత్రి హోదా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో ముఖ్యనేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి ముఖ్య సలహాదారు పదవిని అప్పగించి కేబినెట్ ర్యాంకు హోదా ఇచ్చిన వైఎస్ జగన్... మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాంకు కూడా కేబినెట్ ర్యాంక్ హోదాతో కూడిన కీలక బాధ్యతలు అప్పగించారు. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?