భర్తను వదిలేసి ప్రేయసితో సహజీవనం.. ఆమె లెస్బియన్ అని తెలిసి..
సరిగ్గా 23 రోజుల క్రితం కొత్తగా పెళ్లైన యువతి ఇంటి నుంచి పారిపోయింది.. ఎటు వెళ్లిందో తెలీక అన్ని చోట్లా వెతికించిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు రాష్ట్రమంతా గాలించి, వేరే రాష్ట్రంలో వెతకగా ఓ చోట మరో మహిళతో కనిపించింది. పూర్తిగా ఆరా తీయగా పోలీసులను షాక్‌కు గురిచేసే జవాబు ఇచ్చింది. తాను లెస్బియన్ అని, భర్తతో కాపురం చేయలేనని. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన యువతి పెళ్లికి ముందు నుంచే లెస్బియన్. ఆ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు గద్దించి ఓ యువకుడితో వివాహం చేశారు. పెళ్లైతే అంతా సర్దుకుంటుందని, ఆమె మామూలు స్థితికి వస్తుందని ఆశపడ్డారు. కానీ, అతడితో ఇమడలేని ఆ యువతి ఇంటి నుంచి పారిపోయింది. హరియాణాలోని మానేసర్‌లో ఓ ఇల్లు తీసుకొని తాను ఇష్టపడ్డ మరో యువతితో సహజీవనం చేయడం ప్రారంభించింది.
అయితే, భర్త ఫిర్యాదుతో పోలీసులు ఆమెను వెతికి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎందుకు ఇంటి నుంచి పారిపోయావని జడ్జి ప్రశ్నించగా.. ఆమె తరఫున భర్త నిజం వెల్లడించాడు. ఆమె మరో యువతితో సహజీవనం చేస్తోందని, ఇలా ఇంటి నుంచి పారిపోతుందని తెలీదని చెప్పాడు. అప్పటి వరకు ఈ విషయం తెలియని భర్త తరఫు బంధువులు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు. వాళ్లే కాదు ఈ విచిత్రకర సంఘటనతో కోర్టు ప్రాంగణమంతా విస్తుపోయింది. కాగా, కోర్టుకు వివరణ ఇచ్చిన యువతి మళ్లీ తాను సహ జీవనం చేస్తున్న యువతి వద్దకే మళ్లీ వెళ్లిపోయింది.
Comments
Post a Comment