BRO లో 778 ఉద్యోగాలు.. పదో తరగతి చదివితే చాలు..

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌వో) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రీషియన్, వెహికల్ మెకానిక్, మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానం ద్వారా అప్లై చేసేందుకు అభ్యర్థులు రూ.50 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు ఉండదు.

మొత్తం పోస్టులు : 778
డైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ : 388
ఎలక్ట్రీషియన్ : 101
వెహికిల్ మెకానిక్ : 92

మల్టీ స్కిల్డ్ వర్కర్ : 197
అర్హత, వయసు :
డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ : పదోతరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
ఎలక్ట్రీషియన్ : పదోతరగతితో పాటు ఆటో ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ 27 సంవత్సరాల వయస్సు ఉండాలి.
వెహికల్ మెకానిక్ : పదోతరగతితో పాటు మెకానిక్ సర్టిఫికేట్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి.
మల్టీ స్కిల్డ్ వర్కర్ : పదోతరగతి అర్హతతో పాటు 25 సంవత్సరాలు కలిగిఉండాలి.
దరఖాస్తు ఫీజు : రూ.50. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సంబంధిత అకౌంట్‌లో ఫీజు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
అకౌంట్ వివరాలు : commandant, GREF centre, Pune 411015, Public Fund Account no.11182905409,SBI, Khadki branch Pune code no.01629
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ ద్వారా..
ఎంపిక విధానం : ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్
చివరితేదీ : 05-07-2019
చిరునామా : అకౌంట్ వివరాలు : commandant, GREF centre, Dighi camp, Pune 411015.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?