IBPS RRB Jobs: 12,000 పైగా ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
బ్యాంకు ఉద్యోగాలు చేయాలనుకునేవారికి శుభవార్త. 12,000 పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS. గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), గ్రూప్ ఏ-ఆఫీసర్స్ (స్కేల్-I), గ్రూప్ ఏ- ఆఫీసర్స్ (స్కేల్-II & III) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. 45 రీజనల్ రూరల్ బ్యాంకు(RRB) బ్రాంచ్‌లల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.inఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ముందు యాక్టీవ్‌లో ఉన్న ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు వివరాలు సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు సమయంలో పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ, అడ్రస్, క్వాలిఫికేషన్ వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాలి.
IBPS RRB Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 జూన్ 18
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూలై
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2019 జూలై 4
అప్లికేషన్ సరిదిద్దుకోవడానికి చివరి తేదీ- 2019 జూలై 4
అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2019 జూలై 19
ప్రిలిమినరీ పరీక్ష- 2019 ఆగస్ట్ 3, 4, 11(ఆఫీసర్ స్కేల్ 1), ఆగస్ట్ 17, 18, 25 (ఆఫీసర్ అసిస్టెంట్)
మెయిన్స్ పరీక్ష- 2019 సెప్టెంబర్ 22(ఆఫీసర్ స్కేల్ 1), సెప్టెంబర్ 29(ఆఫీస్ అసిస్టెంట్),
ఆఫీసర్ స్కేల్ 2, 3 అభ్యర్థులకు సెప్టెంబర్ 22న ఒకే పరీక్ష
ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 అభ్యర్థులకు నవంబర్‌లో ఇంటర్వ్యూ
Comments
Post a Comment