India vs Pakistan: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్...ఇండియాకు బ్యాటింగ్ ఆహ్వానం...
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ చేయనుంది.
India vs Pakistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Manchester: మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ చేయనుంది. కాగా తుది జట్టులో గాయంతో జట్టు నుంచి దూరమైన శిఖర్ ధావన్ స్థానంలో విజయ్ శంకర్ ను ఆడనున్నాడు. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ పాక్ మ్యాచ్ అంటేనే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మొత్తం ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ ఒక ఎత్తు అయితే, అందులో భారత్ పాక్ మ్యాచ్ ఒక ఎత్తు. చిరకాల ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్న భారత్, పాక్ జట్లు ఐసీసీ టోర్నీల్లో తప్ప ఇతర క్రికెట్ సంబంధాలు తెగదెంపులు అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ అరుదుగా తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ పాకిస్థాన్ లు 6 సార్లు మ్యాచ్ లో తలపడగా, అందులో భారత్ ఆరుకి ఆరు సార్లుమ్యాచ్ గెలిచి రికార్డు నెలకొల్పింది. దీంతో పాకిస్థాన్ కు వరల్డ్ కప్ లో భారత్ పై గెలవడం అనేది ఒక తీరని కోరికగా మిగిలిపోయింది.
Comments
Post a Comment