రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ IPO (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానుందని
టెలికం రంగంలో సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ IPO (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానుందని వార్తలు వస్తున్నాయి. 2020 ఏడాది రెండో అర్ధభాగంలో ఐపీవోకు రానుందని తెలుస్తోంది. ఈ మేరకు పలుమార్లు వివిధ వర్గాలతో చర్చలు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది. కాగా ఇది వరకే ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిని జియో సైతం ఖండించింది. ఇప్పుడు మళ్లీ జియో IPOకు వెళుతుందనే వార్తలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. 2017లోనే జియో ఐపీఓలోకి వెళ్లేందుకు సెబీ నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ఇప్పుడు అలాంటి అవసరం లేదని తెలుస్తోంది.
Comments
Post a Comment