13 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం
రాజమండ్రి:
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది.
ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 13 అడుగులకు చేరుకుంది.
దీంతో 11 లక్షల 60 వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు.
ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు..
మధ్యాహ్నం మరోసారి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
Comments
Post a Comment