సాయంత్రం సుష్మా స్వరాజ్‌- _అంత్యక్రియలు_


దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత సుష్మా స్వరాజ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.


ఆమె భౌతికకాయానికి  భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆమె మరణం తీరని లోటని, ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు.

దేశం, పార్టీ ఒక గొప్ప రాజకీయ నాయకురాలిని కోల్పోయిందని తెలిపారు.

 పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో ఉంచనున్నట్లు తెలిపారు.

ఈరోజు సాయంత్రం లోధీ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు._


సుష్మకు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే  కుటుంబ సభ్యులు ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు.

ఎయిమ్స్‌ వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

అనారోగ్య కారణాలతో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?