చిన్నమ్మ ఇక లేరు

చిన్నమ్మ ఇక లేరు తీవ్ర గుండెపోటుతో సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణం

*ప్రధాని సహా ప్రముఖుల సంతాపం*

చిన్నమ్మ ఇక లేరు

దిల్లీ: భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఇక లేరు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆమె హఠాన్మరణం చెందారు.

67 ఏళ్ల సుష్మాకు  మంగళవారం రాత్రి 10.15 గంటల సమయంలో గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)కు తరలించారు.

ఆ వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు మార్చారు. చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు.

సుష్మా స్వరాజ్‌ అస్వస్థతకు గురయ్యారని తెలియగానే పలువురు కేంద్ర మంత్రులు హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

ఆమె మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

సుష్మా ఆకస్మిక మరణ వార్త భాజపా నేతలు, కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆమెకు 2016లో మూత్రపిండ మార్పిడి జరిగింది.

అనారోగ్య కారణాల రీత్యా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు.

ఆమెకు భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సురి ఉన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?