ఉధృతంగా ప్రవహిస్తున్న వంశధార
శ్రీకాకుళం :
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని అందవరం గ్రామం వద్ద వంశధార నది ఉధృతంగా ప్రవహిస్తుంది.
ఈ మేరకు గొట్ట బ్యారేజ్ వద్ద లక్షా 12 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.
ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
నది తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికంగా ఆయా గ్రామాల్లో విఆర్ఓ లు పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మండల కేంద్రంలోని కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని తహశీల్దార్ బి రామారావు, ఎంపీడీవో తేజ రతన్ కోరారు.
Comments
Post a Comment